19, ఫిబ్రవరి 2013, మంగళవారం

మీరు స్మార్ట్ ఫోన్ కొన్నారా ?..మరి ఐతే బాటరీ లైఫ్ ని కాపాడుతున్నారా ??..

బాటరీ లైఫ్ ను కాపాడటం మీ చేతుల్లోనే ఉంది.ఇవి కొన్ని నా ఊహకు ఒచ్చినవి.......



1.మీరు ఛార్జ్ ఓవర్ గా చెయ్యమాకండి..100% రాగానే,చార్జర్ తీసివేయండి
2. ఫోన్ ఛార్జింగ్ లో ఉండగా ,కాల్స్ తీసికోవద్దు ..అది మంచిది కాదు.
3.స్క్రీన్ సేవర్ లు ,బాటరీ లైఫ్ ను తగ్గిస్తాయి.
4.అనవసరపు అప్లికేషన్స్ తొలగించండి.
5.అప్లికేషన్స్ కు ఆటోమేటిక్ అప్ డేట్ ఫీచర్ తొలగించండి..అవసరమైనప్పుడే కావాల్సిన అప్లికేషను అప్ గ్రేడ్ చేసికోండి.
6.బ్రైట్ స్క్రీన్ అవసరమైనప్పుడే వాడండి..బాటరీ సేవ్ అవుతుంది.ఆటో అప్డేట్ బ్రైట్ స్క్రీన్ ఆప్షను తీసివేయండి
7.ఆనిమేటెడ్ స్క్రీన్స్ మరియు 3డి వాల్ పేపర్స్ ఎక్కువగా వాడద్దు.
8.మీ సంచారవాణి ని వేడికి దూరంగా ఉంచండి
9.మీరు ప్రయాణంలో ఉండగా 3జి అవసరం లేనప్పుడు ఆపేయండి.2జి సెట్ చేసికోండి
10.ఈమెయిలు ,ముఖ చిత్రం ,ట్విట్టర్ అవసరం లేనప్పుడు ఆపేయండి.ఇది మీ బాటరీ లైఫ్ ను కాపాడుతుంది
11.మీరు స్టాండర్డ్ ఛార్జర్స్ తో మాత్రమే ఛార్జ్ చెయ్యండి

స్మార్ట్ ఫోన్ ను ,స్మార్ట్ గా వాడండి.ఎంజాయ్ చెయ్యండి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి