సాహిత్యం

కొత్త తెలుగు పదాలు కొంత కాలంగా కొన్ని ఆంగ్ల పదాలకు  తెలుగు సమానార్ధక పదాలు కొత్తగా సృష్టించి వాడుతున్నారు ,అందరూ....... ఇది నిజంగా శుభ పరిణామమే! మేము గమనించిన వాటిల్లో కొన్ని...

  • internet -- అంతర్జాలం
  • cellphone -- సంచారవాణి 
  • BPO (Business process outsourcing) -- వ్యాపార పొరుగు సేవలు
  • Board --  నామసూచిక
  • fonts --  ఖతులు
  • User name--వినియోగ నామము
  • Password--సంకేత నామము
  • Sign board--నామసూచిక
  • air hostess -- గగనసఖి
  • browser --  విహారిణి
  • gel -- జిగురు ద్రవం
  • wrong direction -- అపసవ్య దిశ
  • refund -- వాపసు చేయటం
  • contract workers -- ఒప్పంద కార్మికులు/ఉద్యోగులు
  • No frills -- శూన్య మొత్తం
  • Information Technology -- సమాచార సాంకేతిక విజ్ఞాన రంగం
  • outsource -- పొరుగు సేవ
  • Mass copying -- మూక చూచిరాత 
  • value added services -- విలువ జత చేరిన సేవలు
  • Non-convertible debentures -- మార్పిడికి వీలు లేని రుణ పత్రాలు
  • Joint Action Committee (JAC) -- ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస)
  • Convoy -- వాహన శ్రేణి
  • Incharge -- భాధ్యుడు
  • Aircraft -- లోహ విహంగం
  • Quid pro quo -- నీకిది నాకది
  • Touch Screen -- తాకే తెర
  • Toll -- దారి సుంకం
  • Contractor – గుత్తేదారు
  • Outer Ring Road – బాహ్య వలయ వృత్త రహదారి
  • Lobbyist – పైరవీకారుడు/ పైరవీకారిణి
  • B.Tech-సాంకేతిక పట్టా
  • M.Tech-సాంకేతిక స్నాతకోత్తర పట్టా
  • M.B.A.-వ్యాపార నిర్వహణ పట్టా
  • M.Pharmacy-ఔషధశాస్త్ర స్నాతకోత్తర పట్టా
  • Intermediate-ఉన్నత మాధ్యమిక విద్య
  • Mech.Engineer-యంత్ర నిర్వహణ విద్య
  • IT-సమాచార సాంకేతిక విద్య
  • Banks-ధనాగారాలు
  • B.S.N.L-భారతీయ సమాచార నిర్వహన సంస్థ
  • Corporations-ప్రాధికార సంస్థలు
  • Post Graduate-స్నాతకోత్తర పట్టభద్రుడు
  • Engineering-యంత్ర విద్య