15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

ఎప్పుడో ఎక్కడో చదివాను... ఏ దేవుడికి ఏ పూలు ఇష్టమో తెలుసా?



దేవతార్చనకు వాడే పూలను కడగడం, వాసన చూడటం అపరాధం.
వినాయకుడిని గరికతో పూజించాలి
లక్ష్మీ పార్వతుల్నిఎర్రకలువలతో,తామరపూలు,జాజి,ఎర్రగన్నేరు,మల్లె,మొగలి,సువాసనగల ఇతర పూలతో పూజించాలి
సరస్వతీదేవిని మల్లెలు,తెల్ల తామరలు,తదితర తెల్లని పూలతో పూజించాలి
శివుణ్ణి మారేడు దళాలతో,విష్ణువుని తులసి పత్రి తో పూజించాలి
స్త్రీ దేవతల పూజలో తులసి పత్రిని ఉపయోగించరాదు
ఎర్రమందరాలు మినహా మరే ఇతర ఎర్రని పూలను పురుష దేవతల పూజకు వాడరాదు
విష్ణుమూర్తిని అక్షతలతోను,దుర్గను గరికతోనూ,గణపతిని తులసితోను,శివుణ్ణి మొగలిపూలతోను పూజించరాదు.
భైరవుడుని మల్లెపూలతోను,సూర్యున్ని మారేడు దళాలతోను,లక్ష్మీదేవిని తుమ్మి పూలతోనూ పూజించకూడదు

1 కామెంట్‌: